ఏపీలో అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్నాం: కేంద్ర ప్రభుత్వం

22-09-2020 Tue 13:59
Centre declares construction of nuclear power plant in AP
  • శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద ప్లాంట్ నిర్మాణం
  • 6 అణు రియాక్టర్ల ఏర్పాటు
  • అమెరికా కంపెనీతో చర్చలు జరుపుతున్నాం

ఆంధ్రప్రదేశ్ లో అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అణు విద్యుత్ కేంద్ర ఏర్పాటుకు సంబంధించి రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు బదులుగా కేంద్రం స్పష్టతను ఇచ్చింది. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద ఈ ప్లాంటును నిర్మించబోతున్నామని... 1,208 మెగావాట్ సామర్థ్యం కలిగిన 6 అణు రియాక్టర్లను ప్లాంటులో ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. ఈ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం అమెరికాకు చెందిన 'వెస్టింగ్ హౌస్ ఎలెక్ట్రిక్' సంస్థతో చర్చలు జరుపుతున్నామని తెలిపింది. పలు అధ్యయనాల తర్వాత కొవ్వాడ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్టు చెప్పింది.