Vivek: టీఆర్ఎస్ పాలనలో ఆంధ్రా కాంట్రాక్టర్లు, కల్వకుంట్ల కుటుంబీకులే బాగుపడ్డారు: వివేక్

Former MP Vivek fires on TRS Government over LRS and double bedroom houses
  • సిద్ధిపేట కలెక్టరేట్ ఎదుట బీజేపీ ఆందోళన
  • పాల్గొన్న మాజీ ఎంపీ వివేక్
  • ప్రజలను దోపిడీ చేస్తున్నారంటూ ధ్వజం
బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ టీఆర్ఎస్ సర్కారుపై ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పాలనలో ఆంధ్రా కాంట్రాక్టర్లు, కల్వకుంట్ల కుటుంబ సభ్యులే బాగుపడ్డారని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే సీఎం కేసీఆర్ ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారంటూ మండిపడ్డారు.

 కరోనా సమయంలో ప్రజలను పీడించడానికే సర్కారు ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చిందని, కేసీఆర్ సర్కారు ప్రాజెక్టుల పేరుతో ప్రజల సొమ్ము దోచుకుతింటోందని విమర్శించారు. తెలంగాణలో కుటుంబ పాలన నశించాలని అన్నారు. ప్రభుత్వం తక్షణమే ఎల్ఆర్ఎస్ జీవోను రద్దు చేయాలని వివేక్ డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూమిపై సీఎం కేసీఆర్ మాట తప్పారని ఆరోపించారు.

డబుల్ బెడ్రూం గృహాలు, ఎల్ఆర్ఎస్ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ బీజేపీ శ్రేణులు సిద్ధిపేటలో ఇవాళ కలెక్టరేట్ ముట్టడి నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వివేక్ తాజా వ్యాఖ్యలు చేశారు. కాగా, కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగిన బీజేపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు సిద్ధిపేట పీఎస్ కు తరలించారు.
Vivek
KCR
TRS
LRS
BJP
Telangana

More Telugu News