మహేశ్ బాబు సినిమా అమెరికా షూటింగ్ అప్ డేట్స్

22-09-2020 Tue 12:59
Updates of Mahesh Babus latest movie shoot in US
  • 'సర్కారు వారి పాట' ప్రీ ప్రొడక్షన్ పనులు 
  • అమెరికాలో తొలి షెడ్యూలుకు ఏర్పాట్లు
  • ఇప్పటికే యూఎస్ లో లైన్ ప్రొడ్యుసర్
  • కథానాయికగా కీర్తి సురేశ్ ఎంపిక పూర్తి

మహేశ్ బాబు నటించే తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురాం దర్శకత్వంలో ఈ చిత్రం బ్యాంక్ స్కాముల నేపథ్యంలో రూపొందనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కథ ప్రకారం అమెరికాలో కొంత భాగం షూటింగ్ చేయాల్సి ఉండడంతో తొలి షెడ్యూలును అక్కడ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ క్రమంలో అమెరికా షెడ్యూలుకు సంబంధించిన తాజా సమాచారం వెల్లడైంది. యూనిట్ సభ్యులకు 'ఓ' కేటగిరీ వీసాకు సంబంధించిన పేపర్ వర్క్ అంతా పూర్తయిందని ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న గోపీకృష్ణ నర్రావుల తెలిపారు. యూనిట్ కు వర్క్ పర్మిట్ అనుమతులు పొందడానికి గాను ప్రస్తుతం తాను లాస్ ఏంజిలిస్ లో వున్నానని ఆయన చెప్పారు. అలాగే త్వరలోనే దర్శకుడు, కెమేరా మేన్ కలసి లొకేషన్ల ఎంపికకు అమెరికాకు  వెళుతున్నారు.

ఇదిలావుంచితే, ఈ చిత్రంలో కథానాయిక కీర్తిసురేశ్ ని మార్చుతున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదనీ, కీర్తిసురేశ్ ఎంపిక ఇప్పటికే పూర్తయిందని యూనిట్ వర్గాలు ధ్రువీకరించాయి. మరోపక్క, బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ ఇందులో విలన్ పాత్రను పోషిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.