Sajjala Ramakrishna Reddy: ఒక్కసారి చంద్రబాబు గతాన్ని చూడండి: సజ్జల విమర్శనాస్త్రాలు

Sajjala Ramakrishna Reddy says look into Chandrababu past once
  • యునైటెడ్ ఫ్రంట్ లో సెక్యులర్ చొక్కా వేసుకున్నారని వెల్లడి
  • ఆ వెంటనే కాషాయవాదిగా మారారని వివరణ
  • మరోసారి కనికట్టు చేస్తున్నారంటూ వ్యాఖ్యలు
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. ఒక్కసారి చంద్రబాబు గతాన్ని చూడండి అంటూ ట్విట్టర్ లో స్పందించారు. యునైటెడ్ ఫ్రంట్ ఉండగా సెక్యులర్ చొక్కా వేసుకున్నారని తెలిపారు. పరాజయం తప్పదని తెలిసి స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా ఉండి కూడా వాజ్ పేయి నేతృత్వంలోని ఎన్డీయే వైపు పరిగెత్తారని ఆరోపించారు. వెంటనే చొక్కా మార్చేసి కాషాయవాదిగా అవతారం ఎత్తారని విమర్శించారు.

2004లో ఎన్డీయే ఓడిపోయినప్పుడు భవిష్యత్తులో ఎన్నడూ బీజేపీతో కలవనంటూ ఆ చొక్కా వదిలేసి మళ్లీ సెక్యులర్ చొక్కా వేసుకున్నారని, 2014లో మోదీ గాలి ఉందనేసరికి మళ్లీ ఆ చొక్కా మార్చారంటూ సజ్జల ఎద్దేవా చేశారు.

ఇక, 2019లో కాకిలెక్కలు వేసి తానొక జాతీయ నాయకుడిగా, దేశ రక్షకుడిగా అవతారం ఎత్తారని పేర్కొన్నారు. అయితే, బోర్లాపడ్డాక తన ఎంపీలందరినీ బీజేపీలోకి పంపి, ఢిల్లీ కరుణ కోసం మళ్లీ చొక్కా మార్చి తానొక కాషాయవాది అన్నట్టు కనికట్టు చేస్తున్నారని సజ్జల వ్యాఖ్యానించారు.
Sajjala Ramakrishna Reddy
Chandrababu
Telugudesam
YSRCP
BJP

More Telugu News