బీజేపీతో కుమ్మక్కై ప్రభుత్వాన్ని కూల్చేందుకు అధికారులు కుట్రలు పన్నుతున్నారు: శివసేన ఆరోపణ
- ఫడ్నవిస్ ప్రభుత్వమే ఉందని కొందరు అధికారులు భ్రమల్లో ఉన్నారు
- బీజేపీ అధికారంలోకి రాలేదనే బాధ వారిలో ఉంది
- ప్రభుత్వ రహస్యాలను విపక్షాలకు అందజేస్తున్నారు
పోలీస్ కమిషనర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో పాటు ప్రభుత్వంలోని కీలక శాఖల అధికారులను ఆరెస్సెస్ ప్రభావితం చేస్తోందని వ్యాఖ్యానించింది. బీజేపీ అధికారంలోకి రాలేదనే బాధ ఆ అధికారుల్లో ఉందని చెప్పింది. అయితే ఆ అధికారుల వివరాలను తాము ఇప్పుడు చెప్పబోమని తెలిపింది.
తమ స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉండాలని సదరు అధికారులు భావిస్తున్నారని శివసేన మండిపడింది. ప్రభుత్వ రహస్యాలను కొందరు అధికారులు ప్రతిపక్షాలకు చేరవేస్తున్నారని చెప్పింది. ఈ వ్యవహారంపై హోంశాఖ దృష్టి సారించాలని వ్యాఖ్యానించింది.