Arvind: ఈ బిల్లుతో రైతే రాజు అవుతాడు... అందుకే కేసీఆర్ ఉలిక్కిపడుతున్నాడు: ఎంపీ అరవింద్

MP Arvind slams CM KCR and KTR on new agriculture bill
  • కేంద్ర నూతన వ్యవసాయ బిల్లుపై ఎంపీ అరవింద్ స్పందన
  • కేటీఆర్ మార్కెట్ యార్డులతో కుమ్మక్కవుతున్నాడని ఆరోపణ
  • వాటా తగ్గుతుందని కేసీఆర్ భయపడుతున్నారంటూ వ్యాఖ్యలు

కేంద్ర నూతన వ్యవసాయ చట్టం బిల్లుకు లోక్ సభ, రాజ్యసభ ఆమోదం లభించిన నేపథ్యంలో బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై విమర్శలు చేశారు. కేంద్ర నూతన వ్యవసాయ బిల్లుతో రైతే రాజు అవుతాడని, అందుకే ఈ బిల్లును చూసి సీఎం కేసీఆర్ ఉలిక్కిపడుతున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు.  

కేటీఆర్ మార్కెట్ యార్డులతో కుమ్మక్కవుతున్నాడని, మార్కెట్ యార్డుల్లో ఎంతో అవినీతి ఉందని అరవింద్ ఆరోపించారు. ఈ బిల్లు రాకతో మార్కెట్ యార్డుల్లో తమ వాటా తగ్గుతుందని కేసీఆర్ ఆందోళన చెందుతున్నారని విమర్శించారు.

రైతుల పరంగా ఇది ఓ వరం లాంటి బిల్లు అని, ఈ వ్యవసాయ బిల్లుతో దశాబ్దాల పాపాలు పోతాయని పేర్కొన్నారు. తన పంటను ఎప్పుడు, ఎక్కడ అమ్ముకోవాలో రైతే నిర్ణయించుకునేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుందని అన్నారు. రాష్ట్రాలు రైతులపై పన్నులు వేసేందుకు ఈ బిల్లు వీలు కల్పించదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News