Shivabalaji: స్కూల్ లైసెన్స్ రద్దయ్యేంత వరకు పోరాడతా: శివబాలాజీ

I will fight until I get justice says Shivabalaji
  • శివబాలాజీ పిల్లలను ఆన్ లైన్ క్లాసుల నుంచి తొలగించిన స్కూల్
  • హెచ్చార్సీని ఆశ్రయించిన శివబాలాజీ
  • విచారించాల్సిందిగా డీఈవోను ఆదేశించిన హెచ్చార్సీ
ప్రైవేట్ స్కూళ్ల దోపిడీపై సినీ నటుడు శివబాలాజీ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ మణికొండలో ఉన్న మౌంట్ లిటేరా జీ స్కూల్లో చదువుతున్న తన పిల్లలను ఎలాంటి కారణం లేకుండానే ఆన్ లైన్ క్లాసుల నుంచి తొలగించారంటూ ఆయన హెచ్చార్సీని ఆశ్రయించారు. ఆన్ లైన్ క్లాసుల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ తాను చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు ఎంత వరకు వచ్చిందో తెలుసుకునేందుకు ఈరోజు డీఈవోను ఆయన కలిశారు. ఆయనతో పాటు ఆయన భార్య మధుమిత కూడా వచ్చారు.

అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, హెచ్చార్సీ చాలా వేగంగా స్పందించిందని శివబాలాజీ కొనియాడారు. స్కూల్ నుంచి స్పందన వచ్చిందని, తమ పిల్లల ఆన్ లైన్ క్లాసులకు యాక్సెస్ ఇచ్చారని చెప్పారు. అయితే తమ పిల్లలను ఎందుకు తొలగించారో స్కూల్ యాజమాన్యం చెప్పాలని డిమాండ్ చేశారు. టెక్నికల్ సమస్య వల్ల అలా జరిగిందని స్కూల్ వాళ్లు చెపుతున్నారని అన్నారు. కానీ, కావాలనే ఇలా చేశారని, దానికి సంబంధించిన ఆధారాలను డీఈవోకి ఇచ్చామని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం జరగకపోతే స్కూల్ లైసెన్స్ రద్దయ్యేంత వరకు పోరాడుతామని చెప్పారు. డీఈవోకు అన్ని విషయాలను వివరించామని తెలిపారు.
Shivabalaji
Tollywood
HRC
Children

More Telugu News