Kodali Nani: దేవుళ్లపై కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు.. నిప్పులు చెరిగిన సోము వీర్రాజు!

Kodali Nani has to take back his comments demands Somu Veerraju
  • మెడలో రుద్రాక్షలు వేసుకుని దేవుళ్లను విమర్శిస్తున్నారు
  • అసెంబ్లీలో కూడా నోటికొచ్చినట్టు మాట్లాడతారు
  • అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తాం
హిందూ దేవుళ్లపై ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఖండించారు. మెడలో రుద్రాక్షలు వేసుకున్న కొడాలి నాని అసలు ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతోందా? అని మండిపడ్డారు. గతంలో రుద్రాక్షల గురించి తాను అడిగితే వాటిని తీయకూడదని గొప్పగా చెప్పిన కొడాలి నాని... ఇప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీలో కూడా నోటికొచ్చినట్టు మాట్లాడతారని  అన్నారు. ఎదుటి వారిని తిట్టించి నవ్వుకోవడం ప్రభుత్వ పెద్దలకు సమంజసమా? అని ప్రశ్నించారు.

దేవుడిపై, ధర్మంపై  కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సరికాదని వీర్రాజు అన్నారు. కొడాలి నాని తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందువులకు క్షమాపణ చెప్పాలని రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా త్వరలోనే కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తుందని అన్నారు. దేవుళ్లను అవమానించేలా మాట్లాడిన కొడాలి నానిపై రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తామని చెప్పారు. మధ్యాహ్నం మూడు గంటలకు అన్ని ప్రాంతాల్లో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయాలలో వినతిపత్రాలను సమర్పిస్తామని అన్నారు.
Kodali Nani
YSRCP
Somu Veerraju
BJP
Hindu Gods

More Telugu News