'సింగం సూర్య' లుక్ లో కనిపించిన ధోనీ... వైరల్ అవుతున్న ఫోటోలు!

20-09-2020 Sun 11:38
Dhoni New Lood Pics Viral
  • స్టయిల్ మార్చుకున్న ధోనీ
  • నిన్నటి మ్యాచ్ లో కొత్త లుక్ తో దర్శనం
  • పలు కామెంట్లు పెడుతున్న ఫ్యాన్స్

మహేంద్ర సింగ్ ధోనీ... ఈ పేరు వినగానే క్రికెట్ అభిమానుల్లో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మైదానంలో ధోనీ బ్యాట్ పట్టుకుని ఉన్నంత సేపూ, అది టీమిండియా అయినా, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టయినా, ఓడిపోతుందని ఎవరూ అనుకోరు. మరోమారు అదే విషయం నిన్న నిరూపితమైంది. ఇదే సమయంలో అంతకన్నా, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ధోనీ,తన గడ్డం స్టయిల్ ను మార్చేయడం.

తొలుత పొడవైన జుట్టుతో క్రికెట్ రంగ ప్రవేశం చేసిన వేళ, ధోనీ చిత్రాలు ఎంత వైరలో, ఇప్పుడు ఆయన కొత్త స్టయిల్ అంతే వైరల్ అయి, టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. దక్షిణాది బాషల్లో సూపర్ హిట్ గా నిలిచిన సూర్య, 'సింగం' చిత్రాల్లో మాదిరిగా, ధోనీ తన స్టయిల్ ను మార్చుకున్నారు. ఇక, ఈ చిత్రాలు వైరల్ కావడంతో ఫ్యాన్స్ పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.