దిల్ రాజు దంపతులకు పట్టువస్త్రాలు బహూకరించిన మంత్రి ఎర్రబెల్లి దంపతులు

18-09-2020 Fri 20:14
Producer Dil Raju and his wife met Minister Errabelli couple
  • ఇటీవలే తేజస్వినితో దిల్ రాజు వివాహం
  • ఓ కార్యక్రమంలో ఎర్రబెల్లి దంపతులను కలిసిన దిల్ రాజు
  • ఆప్యాయంగా ముచ్చటించిన ఎర్రబెల్లి దంపతులు

ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ఇటీవలే లాక్ డౌన్ సమయంలో తేజస్విని అనే మాజీ ఎయిర్ హోస్టెన్ ను పెళ్లాడడం తెలిసిందే. పెళ్లి తర్వాత కొన్నివారాలకు ఆయన భార్యతో కలిసి తిరుమల వచ్చారు. ఈ సందర్భంగా దిల్ రాజు దంపతులు మీడియా దృష్టిని విశేషంగా ఆకర్షించారు. తాజాగా దిల్ రాజు, తేజస్విని దంపతులు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులను కలిశారు.

ఓ కార్యక్రమంలో దిల్ రాజు, ఎర్రబెల్లి దంపతులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దంపతులు... దిల్ రాజు, తేజస్వినిలకు పట్టు వస్త్రాలు బహూకరించారు. ఎర్రబెల్లి దంపతులు దిల్ రాజు దంపతులలో ఆప్యాయంగా ముచ్చటించారు. ఇటీవలే దిల్ రాజు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ముగ్గురు అనాథ చిన్నారులను దత్తత తీసుకున్నారు. మంత్రి ఎర్రబెల్లి సూచనల మేరకు దిల్ రాజు పెద్ద మనసుతో స్పందించారు. దాంతో మంత్రి ఎర్రబెల్లి నిర్మాత దిల్ రాజును ఎంతగానో అభినందించారు.