Mission Build AP: ప్రభుత్వ భూముల అమ్మకంపై పిటిషన్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు

  • మిషన్ బిల్డ్ ఏపీ కింద భూముల విక్రయంపై పిటిషన్
  • ప్రతి పనికి అడ్డు తగులుతున్నారన్న ఏఏజీ
  • ఎవరి గురించి మాట్లాడారని ప్రశ్నించిన జస్టిస్ రాకేశ్ కుమార్
AP High Court interesting comments during hearing of Mission Build AP petition

మిషన్ బిల్డ్ ఏపీ కింద ప్రభుత్వ ఆస్తులను విక్రయించడాన్ని సవాల్ చేస్తూ గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త తోట సురేశ్ బాబు వేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు ఈరోజు విచారించింది. ఈ పిటిషన్ ను జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ ఉమాదేవితో కూడిన ధర్మాసనం విచారించింది.

ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున ఏఏజీ వాదిస్తూ... ప్రతి పనికి అడ్డు తగులుతున్నారని... పరిపాలనను కూడా వారినే చేసుకోమనండి అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై జస్టిస్ రాకేశ్ కుమార్ వెంటనే స్పందించారు. 'మీరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు? హైకోర్టునా? పిటిషనర్ నా?' అని ప్రశ్నించారు. అన్ని విషయాలను కూలంకుషంగా విచారించి తీర్పును చెప్పడానికి విచారణను అక్టోబర్ 16కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న అన్ని శాఖల కార్యదర్శులు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు.

More Telugu News