వ్యాపారవేత్త కుమార్తెను పెళ్లి చేసుకోబోతున్న అఖిల్?

18-09-2020 Fri 19:01
Akkineni akhil to marry businessmans daughter
  • అఖిల్ పెళ్లి బాధ్యతలను తీసుకున్న సమంత
  • ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నాయని సమాచారం
  • త్వరలో వెలువడనున్న ప్రకటన

అక్కినేనివారి ఇంట త్వరలోనే పెళ్లిబాజాలు మోగనున్నట్టు తెలుస్తోంది. అఖిల్ అక్కినేని పెళ్లి ఫిక్స్ అయిపోయిందని, ఓ వ్యాపారవేత్త కుమార్తెను పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, ఈ పెళ్లి బాధ్యతలను ఆయన వదిన సమంత తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే ఇరు కుటుంబాలు కలిసి మాట్లాడుకున్నాయని... త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడనుందని చెపుతున్నారు.

మరోవైపు శ్రేయాభూపాల్ తో గతంలో అఖిల్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఊహించని విధంగా వారి పెళ్లి ఆగిపోయింది. అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఉంటే... తన అన్న నాగచైతన్య కంటే ముందే అఖిల్ పెళ్లి జరిగిపోయేది.