Harsimrat Badal: బీజేపీకి షాక్.. కేంద్ర మంత్రి పదవికి హర్ సిమ్రత్ బాదల్ రాజీనామా!

Union Minister Harsimrat Badal Resigns Over Centres New Bills For Farmers
  • లోక్ సభలో వ్యవసాయ సంబంధిత బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం
  • బిల్లును వ్యతిరేకించిన శిరోమణి అకాళీదళ్
  • ప్రభుత్వానికి వెలుపలి నుంచి మద్దతిస్తామని ప్రకటన
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వ్యవసాయ సంబంధిత బిల్లులు ఎన్డీయే కూటమిలో చిచ్చును రాజేశాయి. ఈ బిల్లుల్లో పలు అంశాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని, వ్యవసాయ రంగాన్ని మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టేసేలా ఉన్నాయని కూటమిలో భాగస్వామి అయిన శిరోమణి అకాళీదళ్ అభిప్రాయపడింది. అంతేకాదు బిల్లును వ్యతిరేకిస్తూ ఆ పార్టీ సభ్యురాలు హర్ సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు.

లోక్ సభలో ఈ బిల్లులు ఓటింగ్ కు వెళ్లే ముందు ఆమె రాజీనామా చేశారు. ప్రధాని కార్యాలయంలో తన రాజీనామాను అందించారు. ఈ సందర్భంగా ఆమె భర్త, పార్టీ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి తాము వెలుపలి నుంచి మద్దతును ఇస్తామని... ఇదే సమయంలో రైతుల వ్యతిరేక విధానాలను మాత్రం తాము వ్యతిరేకిస్తామని చెప్పారు.
Harsimrat Badal
Resign
Akalidal
NDA

More Telugu News