Vijayasai Reddy: రాజ్యసభలో కోర్టులను విమర్శించిన విజయసాయిరెడ్డి.. అభ్యంతరం వ్యక్తం చేసిన డిప్యూటీ ఛైర్మన్!

  • కరోనాపై చర్చ సందర్భంగా కోర్టులపై మాట్లాడిన విజయసాయి
  • పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆరోపణ
  • సబ్జెక్ట్ లైన్ దాటి మాట్లాడుతున్నారని డిప్యూటీ ఛైర్మన్ అభ్యంతరం
Vijayasai Reddy criticises Courts in Rajya Sabha

రాజ్యసభలో కరోనా వైరస్ పై చర్చ సందర్భంగా వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై కోర్టులు స్టేలు విధిస్తున్నాయని, రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.

ఈ క్రమంలో విజయసాయిని డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. సబ్జెక్ట్ దాటి మాట్లాడుతున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా విజయసాయి ఏమాత్రం పట్టించుకోకుండా తన ధోరణిలో మాట్లాడుతూ పోయారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యుడు కనకమేడల కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాల గురించి పార్లమెంటులో మాట్లాడటం దారుణమని అన్నారు. కోర్టులను కూడా బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారని అన్నారు. కరోనా గురించి మాట్లాడకుండా, ఇతర అంశాల గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. 

More Telugu News