Corona Virus: కరోనా బారినపడిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.. సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిన వైనం!

Union Minister Nitin Gadkari infected to Corona Virus
  • అనారోగ్యంగా ఉండడంతో వైద్యులను కలిసి పరీక్షలు
  • ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానన్న మంత్రి
  • తనను కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని సూచన
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. అనారోగ్యంగా ఉండడంతో వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోగా కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని మంత్రి పేర్కొన్నారు.

తన ఆరోగ్యం బాగానే ఉందని, ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నానని పేర్కొన్నారు. తనకు కొంత అనారోగ్యంగా ఉండడంతో వైద్యుడిని సంప్రదించానని, కొవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలిందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. వైద్యుల సలహా మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని గడ్కరీ సూచించారు.
Corona Virus
Nitin Gadkari
Corona positive

More Telugu News