మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై భారీ చోరీ.... రూ.80 లక్షల విలువైన ఫోన్లు దోచేసిన దుండగులు
- 980 మొబైల్ ఫోన్లు చోరీ
- శ్రీసిటీ నుంచి కోల్ కతా వెళుతున్న కంటెయినర్
- కంటెయినర్ వెనుకభాగం తెరిచి దోపిడీ
ఈ నేపథ్యంలో కాజ టోల్ గేట్ వద్ద కంటెయినర్ ను నిలిపి, మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి ఈ ఘటనపై వెంటనే స్పందించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఆయన, మధ్యప్రదేశ్ కు చెందిన ముఠా ఈ దోపిడీకి పాల్పడి ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఇదే తరహాలో కొన్నివారాల కిందట చిత్తూరు జిల్లాలోనూ ఓ కంటైనర్ నుంచి మొబైల్ ఫోన్లు చోరీ చేశారు. వాటి విలువ రూ.10 కోట్లు అని తెలిసింది.