Sensex: కరోనా వ్యాక్సిన్ వస్తుందనే అంచనాలతో లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

Sensex closes 259 points high
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. మన దేశంలో కరోనా వ్యాక్సిన్ త్వరగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనే వార్తలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ నేపథ్యంలో, ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 259 పాయింట్లు పెరిగి 39,303కి చేరింది. నిఫ్టీ 83 పాయింట్లు లాభపడి 11,605కి చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (4.24%), బజాజ్ ఆటో (3.44%), సన్ ఫార్మా (2.50%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.11%), ఇన్ఫోసిస్ (1.95%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.80%), ఎన్టీపీసీ (-1.43%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.95%), ఓఎన్జీసీ (-0.88%), భారతి ఎయిర్ టెల్ (-0.83%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News