నాన్న గారికి మరికొన్ని రోజుల్లో ఎక్మో, వెంటిలేటర్ తొలగిస్తారనుకుంటున్నా: ఎస్పీ చరణ్

Wed, Sep 16, 2020, 03:14 PM
SP Charan tells health details of his ailing father SP Balasubrahmanyam
  • ఎస్పీ బాలు ఆరోగ్యం నిలకడగా ఉందన్న చరణ్
  • ఇప్పటికీ ఎక్మో, వెంటిలేటర్ పైనే చికిత్స జరుగుతోందని వెల్లడి
  • ఫిజియోథెరపీ కొనసాగుతోందంటూ ట్వీట్
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు. ఎస్పీ బాలు ఆగస్టు మొదటి వారం నుంచి కరోనా మహమ్మారితో పోరాడుతూ ఆసుపత్రిలోనే ఉన్నారు. ఓ దశలో పరిస్థితి విషమంగా  మారడంతో ఎస్పీ బాలును ఐసీయూకి తరలించి వెంటిలేటర్ అమర్చారు. ఆపై ఎక్మో సాయం కూడా అందిస్తున్నారు. దీనిపై ఎస్పీ చరణ్ తాజాగా ఓ ప్రకటన చేశారు.

త్వరలోనే తన తండ్రికి ఎక్మో, వెంటిలేటర్ తొలగించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతానికి ఆయనకు వెంటిలేటర్, ఎక్మో వ్యవస్థల సాయంతోనే చికిత్స జరుగుతోందని వెల్లడించారు. ఫిజియోథెరపీ కొనసాగుతోందని ట్విట్టర్ లో వివరించారు. ఎంజీఎం ఆసుపత్రి వైద్యుల బృందానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, అంతేకాకుండా, తన తండ్రి క్షేమం కోసం ప్రార్థిస్తున్న వారందరికీ ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement