Nara Lokesh: జగన్ గారు, నాయీ బ్రాహ్మణులకే సంక్షేమ 'కటింగ్' చేశారు: నారా లోకేశ్

Nara Lokesh demands AP government must help barbers
  • నేడు వరల్డ్ బార్బర్స్ డే
  • నాయీ బ్రాహ్మణులకు శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్
  • బార్బర్లను ప్రభుత్వం ఆదుకోవాలంటూ డిమాండ్
నేడు వరల్డ్ బార్బర్స్ డే సందర్భంగా నాయీ బ్రాహ్మణులందరికీ శుభాకాంక్షలు అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు. నాయీ బ్రాహ్మణ వృత్తి ఓ కళ అని, ఆ కళలో నైపుణ్యం పెంచడం కోసం గత టీడీపీ హయాంలో కృషి చేశామని తెలిపారు. సెలూన్ అంటే కేవలం జీవనాధారం కోసం అని కాకుండా, ఒక పరిశ్రమలా ఎదగాలన్న ఆలోచనతో అవసరమైనవన్నీ చేశామని వివరించారు. కానీ ఇప్పుడు బీసీ కార్పొరేషన్ నిర్వీర్యమైపోయిందని, ఆదరణ పథకం రద్దయిపోయిందని విమర్శించారు.

"రూ.5 లక్షల ప్రమాద బీమా పత్తా లేదు. జగన్ గారు, 5.50 లక్షల మందిలో కేవలం 38 వేల మందికే చేదోడు ఇచ్చి నాయీ బ్రాహ్మణులకే సంక్షేమ 'కటింగ్' చేశారు" అంటూ విమర్శించారు. కరోనా ప్రత్యేక సాయాన్ని ప్రకటించి బార్బర్లను ప్రభుత్వం ఆదుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
Nara Lokesh
Barbers
World Barbers Day
Jagan
Andhra Pradesh

More Telugu News