Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమాకి ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారో మరి!

Titles considered for Pawan Kalyans movie with Krish
  • వరుస సినిమాలతో దూకుడు పెంచిన పవన్ 
  • 'వకీల్ సాబ్' తర్వాత క్రిష్ దర్శకత్వంలో సినిమా
  • పాన్ ఇండియా మూవీగా నిర్మాణం
  • పరిశీలనలో 'విరూపాక్ష', 'ఓం శివమ్' టైటిల్స్    
ఆమధ్య రాజకీయాలలో బిజీ అయి, కొన్నాళ్లు సినిమాలకు దూరమైన పవన్ కల్యాణ్ ఇప్పుడు దూకుడు పెంచారు. వరుసగా సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మూడు నాలుగు చిత్రాలు లైన్లో పెట్టారు. వీటిలో 'వకీల్ సాబ్' చిత్రం ప్రస్తుతం నిర్మాణంలో వుండగా, దీని తర్వాత క్రిష్ దర్శకత్వంలో రూపొందే పవన్ 27వ చిత్రం మొదలవుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి.

ఇక ఈ చిత్రం టైటిల్ పై అప్పుడే సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఫలానా టైటిల్ని ఫిక్స్ చేశారంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. కొందరేమో ఆయా టైటిల్స్ తో చక్కగా లోగోలు కూడా డిజైన్ చేసి వదులుతున్నారు. అయితే, ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఏదీ ఖరారు కాలేదని తెలుస్తోంది.

ప్రస్తుతానికి 'విరూపాక్ష', 'గజదొంగ', 'బందిపోటు', 'ఓం శివమ్' వంటి పేర్లు సామాజిక మాధ్యమాలలో ప్రచారంలో ఉన్నప్పటికీ, 'విరూపాక్ష', 'ఓం శివమ్' అనే పేర్లను మాత్రమే చిత్రం యూనిట్ సీరియస్ గా పరిశీలిస్తున్నారని అంటున్నారు. ఈ రెండింటిలోను ఒక దానిని ఫైనల్ చేసే అవకాశం వుంది.

ఈ చిత్రం స్వాతంత్ర్యానికి పూర్వ కాలం నాటి కథతో పిరీడ్ మూవీగా రూపొందుతోందని మొదటి నుంచీ ప్రచారం జరుగుతోంది. దీంతో వీఎఫ్ఎక్స్ పనులకు కూడా చాలా ప్రాధాన్యత వుందట. అందుకే, ప్రముఖ హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ నిపుణుడు బెన్ లాక్ ను తీసుకున్నట్టు చెబుతున్నారు. నార్త్ లో కూడా పవన్ కి మంచి మార్కెట్ వుండడం వల్ల ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో దర్శకుడు క్రిష్ ప్లాన్ చేస్తున్నాడు!            
Pawan Kalyan
Krish
Virupaksha
Om Shivam

More Telugu News