indonesia: మాస్కులు ధరించకపోతే వినూత్న శిక్ష అమలు చేస్తోన్న ఇండోనేషియా అధికారులు

dig graves sentence for indonesia mask rule violators
  • గోతులు తవ్వే శిక్షను విధిస్తున్న అధికారులు
  • కరోనా సోకి చనిపోయిన వారి కోసం వినియోగం
  • తూర్పు జావా గ్రేసిక్‌ రీజెన్సీ ప్రాంతంలో శిక్ష అమలు
  • వారితోనే ఖననం చేయిస్తోన్న అధికారులు
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి మాస్కులు ధరించాలని అన్ని దేశాలు పౌరులకు సూచనలు చేస్తోన్న విషయం తెలిసిందే. మాస్కులు పెట్టుకోకుండా బయట తిరిగితే జరిమానాలు కూడా విధిస్తున్నారు. ఈ క్రమంలో ఇండోనేషియాలోని జావాకు చెందిన అధికారులు వినూత్న రీతిలో శిక్ష అమలు చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.

మాస్కులు ధరించకుండా రోడ్లపై తిరిగే వారిని పట్టుకుని గోతులు తవ్వే శిక్షను విధిస్తున్నారు. కరోనా సోకి చనిపోయిన వారిని ఖననం చేయడానికి అవసరమైన గోతులను తీయడానికి తూర్పు జావా గ్రేసిక్‌ రీజెన్సీ ప్రాంతంలో మనుషులు కరవయ్యారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గోతులు తీసే కార్మికులు ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ పనిని మాస్కులు ధరించకుండా తిరుగుతోన్న వారికి అప్పగిస్తున్నారు. ఇప్పటివరకు ఆ ప్రాంతంలో ఎనిమిది మంది వ్యక్తులకు ఈ శిక్ష అమలు చేశారు. గుంతలు తీయించి, వారితోనే మృతదేహం ఉన్న చెక్కపెట్టెలను పాతిపెట్టించారు.
indonesia
mask
Corona Virus
COVID-19

More Telugu News