Amitabh Bachchan: అమితాబ్‌ బచ్చన్ చిన్నప్పుడు ఇలా ఉండేవారు!

amitab shares childhood pic
  • ఫొటో పోస్ట్ చేసిన బిగ్ బీ
  • గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న అమితాబ్
  • వచ్చే నెల 11న ఆయన పుట్టినరోజు
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చిన్నప్పుడు ఇలా ఉండేవారు. గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆయనే స్వయంగా ఈ ఫొటోను పోస్ట్ చేశారు. వచ్చే నెలలో పుట్టినరోజు జరుపుకోనున్న అమితాబ్ బచ్చన్.. ఈ సందర్భంగా ఇలా చిన్నప్పుడు బోసినవ్వులు చిందిస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. అప్పట్లో అలా ఉండేవాడినని, ఇప్పుడు ఇలా ఉన్నానని ఆయన చెప్పారు.

ఈ ఫొటోను చూసిన ఆయన అభిమానులు 'లిటిట్ బీ', చాలా క్యూట్, నైస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్ చాలా అరుదుగా తన పాత చిత్రాలను షేర్‌ చేస్తుంటారు. వచ్చేనెల 11న ఆయన 78వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ప్రస్తుతం ఆయన 'కౌన్‌ బనేగా కరోడ్‌పతి సీజన్ 12 షూటింగులో పాల్గొంటున్నారు. ఇటీవలే ఆయన కరోనా నుంచి కోలుకున్న విషయం తెలిసిందే.  

         
Amitabh Bachchan
Bollywood
Instagram

More Telugu News