Vaccine: క్లినికల్ ట్రయల్స్ లో చివరిదశకు చేరుకున్న చైనా వ్యాక్సిన్లు

China vaccines may be ready for use in two months
  • చైనాకు చెందిన నాలుగు వ్యాక్సిన్లపై అందరి దృష్టి
  • నవంబరు నాటికి అందుబాటులోకి రానున్న మూడు వ్యాక్సిన్లు
  • సైన్యానికి అందించేందుకు ఓ వ్యాక్సిన్ కు జూన్ లోనే అనుమతి
కరోనా వైరస్ రక్కసికి పుట్టినిల్లుగా చెడ్డపేరు తెచ్చుకున్న చైనా వ్యాక్సిన్ల విషయంలో దూసుకుపోతోంది. చైనా జాతీయ ఫార్మా గ్రూప్ సినోఫార్మ్, సినోవాక్ బయోటెక్ సంయుక్తంగా మూడు వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నాయి. మరో వ్యాక్సిన్ ను కాన్సినో బయోలాజిక్స్ తయారుచేసింది. ఈ నాలుగు చైనా వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ లో చివరి దశకు చేరుకున్నాయి.

ఇవి ఆఖరిదైన మూడో దశ మానవ ప్రయోగాల్లో ఉన్నాయని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వెల్లడించింది. వీటిలో మూడు నవంబరు నాటికి ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ప్రస్తుతం వీటి ప్రయోగాలు సజావుగా సాగుతున్నాయని తెలిపింది.

దీనిపై సీడీసీ బయోసేఫ్టీ నిపుణుడు గైఝెన్ వూ మాట్లాడుతూ, గత ఏప్రిల్ లోనే తాను వ్యాక్సిన్ తీసుకున్నానని, ఇప్పటివరకు ఎలాంటి విపరీతమైన మార్పులు కనిపించలేదని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని వెల్లడించారు. కాగా, కాన్సినో బయోలాజిక్స్ తయారు చేసిన వ్యాక్సిన్ ను సైన్యం వినియోగించేందుకు చైనా ప్రభుత్వం జూన్ లోనే అనుమతి ఇచ్చింది.
Vaccine
China
Corona Virus
COVID-19

More Telugu News