నేడు మరి కాస్త తగ్గిన పెట్రోలు ధర!
- 18 పైసల వరకూ తగ్గిన పెట్రోలు ధర
- డీజిల్ ధరలో 24 పైసల వరకూ కోత
- హైదరాబాద్ లో లీటర్ పెట్రోలు ధర రూ. 84.75
దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలుపై 17 పైసలు, డీజిల్ పై 22 పైసల మేరకు ధరలు తగ్గాయి. కాగా, ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుదలను నమోదు చేయడంతో, ఒకటి, రెండు రోజుల్లోనే ఇండియాలోనూ ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. బ్రెంట్ క్రూడాయిల్ ధర 0.05 శాతం పెరిగి, బ్యారల్ కు 39.63 డాలర్లకు చేరగా, డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర 0.11 శాతం పెరిగి 37.30 డాలర్ల వద్ద కొనసాగింది.