UNO: ఐక్యరాజ్య సమితి కీలక కమిటీలో భారత్‌కు చోటు.. చైనాకు దారుణ పరాభవం!

India wins place in UNO body for five years
  • ‘యూఎన్ కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్’లో సభ్యత్వం
  • ఆఫ్ఘనిస్థాన్ కు ఎక్కువ ఓట్లు
  • కనీస ఓట్లు సాధించలేకపోయిన చైనా
భారత్‌కు అంతర్జాతీయంగా రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. ఐక్యరాజ్య సమితిలోని ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్ (ఈసీఓఎస్ఓసీ)కి చెందిన ‘యూఎన్ కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్’లో భారత్‌కు సభ్యత్వం లభించింది. రెండు స్థానాల కోసం జరిగిన ఎన్నికల్లో భారత్‌తోపాటు చైనా, ఆఫ్ఘనిస్థాన్ కూడా బరిలో నిలిచాయి. ఆఫ్ఘనిస్థాన్, భారత్‌ లు చైనాను ఓడించి సభ్యత్వం పొందాయి.

ఈ సందర్భంగా ఐరాసలోని భారత శాశ్వత రాయబారి తిరుమూర్తి మాట్లాడుతూ.. లింగ సమానత్వం, మహిళా సాధికారత కోసం భారత్ చేస్తున్న కృషికి ఈ విజయం గుర్తింపు వంటిదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమకు మద్దతుగా నిలిచిన సభ్యదేశాలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ గెలుపుతో యూఎన్ కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్‌లో భారత్ సభ్యత్వం ఐదేళ్లపాటు అంటే 2025 వరకు ఉంటుంది. రహస్య ఓటింగ్ ద్వారా జరిగిన ఈ ఎన్నికలో నెగ్గడానికి కనీసం 28 ఓట్లు రావాలి. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్థాన్ కు 39, భారత్ కు 38, చైనాకు 27 ఓట్లు పోలయ్యాయి.
UNO
India
China
Afghanistan

More Telugu News