శ్రీకాంత్‌కు గుండు గీయమని నేను చెప్పలేదు: నూతన్ నాయుడు

15-09-2020 Tue 10:37
  • ముగిసిన మూడు రోజుల కస్టడీ
  • చిట్టీలు, క్రెడిట్ కార్డులతో నెట్టుకొస్తున్నానన్న నూతన్ నాయుడు
  • రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పేరును వాడుకోలేదన్న నూతన్
Nutan Naidu police custody ends
శిరో ముండనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నూతన్ నాయుడు మూడు రోజుల పోలీసుల విచారణలో పలు విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నూతన్‌ను పోలీసులు విచారించారు. ముఖ్యంగా శిరోముండనం విషయంలో తాను పూర్తిగా నిర్దోషినని చెప్పినట్టు సమాచారం. దళిత యువకుడు శ్రీకాంత్‌కు గుండు గీయమని చెప్పలేదని విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. తన ఆరోగ్యం బాగాలేదని పదేపదే చెప్పుకొచ్చాడు.

ఇక, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ పేరు చెప్పి పనులు చేయించుకునే శక్తి తనకు లేదని, ఆ విషయంలో తనపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నాడు. క్రెడిట్ కార్డులు, చీటీలు పాడిన డబ్బులతోనే తాను నెట్టుకొస్తున్నానని చెప్పినట్టు సమాచారం. కాగా, నిన్నటితో నూతన్ నాయుడు పోలీస్ కస్టడీ ముగిసింది.