Renu Desai: నా సినిమా కోసం ఆయన పాట రాయడం ఎంతో గర్వంగా ఉంది: రేణు దేశాయ్

Renu Desai met Gorati Venkanna
  • రైతు సమస్యలపై సినిమా తీస్తున్న రేణు దేశాయ్
  • సినిమా కోసం పాట రాస్తున్న గోరటి వెంకన్న
  • వెంకన్న వ్యవసాయ భూమికి వెళ్లిన రేణు
రేణు దేశాయ్ మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్నారు. నటిగా, దర్శకురాలిగా, రచయితగా, నిర్మాతగా తనను తాను నిరూపించుకున్న రేణు... తాజాగా రైతు సమస్యలపై ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రముఖ రచయిత గోరటి వెంకన్న పాట రాస్తున్నారు.

తాజాగా గోరటి వెంకన్నను రేణు కలిశారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె వెల్లడించారు. 'లిరిక్ సెషన్ కోసం వెంకన్న గారి ఫామ్ కు వెళ్లాను. తన చిత్రం కోసం ఆయన పాట రాయడాన్ని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఆయన భార్య మట్టి పాత్రల్లో అన్నం, పప్పు వండారు. రుచికరమైన రోటీ పచ్చడి చేశారు. నాకు పువ్వులకు బదులు... భోంచేయడానికి అరటి ఆకును గిఫ్టుగా ఇచ్చారు. వర్షం కురుస్తున్న సమయంలో ఒక చిన్న వ్యవసాయభూమిలో సాధారణ జీవితం గడుపుతున్న పెద్ద మనుషుల మధ్య గడపడం మంచి అనుభూతిని అందించింది' అని తెలిపారు. మరోవైపు ఈ సినిమా కోసం రైతు సమస్యలను తెలుకునే క్రమంలో రేణు పలువురు రైతులను కలిసిన సంగతి తెలిసిందే.
Renu Desai
Tollywood
Gorati Venkanna

More Telugu News