dog: షాకింగ్ వీడియో.. కుక్కను చెరువులో పడేసిన యువకుడు

Man throws dog into Bhopal lake video goes viral probe on
  • మధ్యప్రదేశ్‌లో మూగజీవంపై అమానుష ఘటన 
  • వీడియో తీసుకున్న యువకుడు
  • సామాజిక మాధ్యమాల్లో వైరల్
  • దర్యాప్తు జరుపుతోన్న పోలీసులు
మూగజీవాలపై అమానుష ఘటనలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. తాజాగా ఓ యువకుడు ఓ వీధి కుక్కను చెరువులో పడేసి పైశాచిక ఆనందాన్ని పొందాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

భోపాల్‌లోని వన విహార్‌కు సమీపంలోని బోట్‌ క్లబ్‌ రోడ్‌ బడా తలాబ్ (చెరువు) వద్ద ఓ యువకుడు ఈ చర్యకు పాల్పడ్డాడు. రెండు కుక్కలు అక్కడి రోడ్డుపై వెళ్తుండడాన్ని చూసిన ఓ యువకుడు వాటిల్లో ఒకదాన్ని పట్టుకుని చెరువులోకి విసిరేశాడు. ఆ సమయంలో అతడి స్నేహితుడు ఈ వీడియో తీశాడు. ఈ వీడియోకు హిందీ పాటను జోడించి, ఏదో ఘన కార్యం చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

ఈ వీడియో వైరల్ కావడంతో భోపాల్ పోలీసులు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శ్యామలా హిల్స్‌ పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. నిందితులను పోలీసులు ఇప్పటికే గుర్తించి, అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.  
        
dog
Viral Videos
Madhya Pradesh

More Telugu News