BMC: కంగన ఉంటున్న ఇల్లు కూడా అక్రమమే... షాకిచ్చిన బీఎంసీ అధికారులు!

Another Notice to Kangana from BMC
  • ఖర్ వెస్ట్ ప్రాంతంలో కంగన ఇల్లు
  • నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం
  • సమాధానం కోరిన బీఎంసీ
ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి, కట్టడాలు నిర్మించినట్టు ఆరోపిస్తూ, గత వారంలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కార్యాలయాన్ని కూల్చివేసిన ముంబై మునిసిపల్ (బీఎంసీ) అధికారులు, తాజాగా, ఆమె నివాసం కూడా అక్రమ కట్టడమేనంటూ నోటీసులు ఇచ్చారు.

ప్రస్తుతం ఖర్ వెస్ట్ ప్రాంతంలో ఉన్న ఓ భవనంలో కంగనా ఐదో అంతస్తులో నివాసం ఉంటుండగా, అదే భవనంలో ఆమెకు మూడు ఫ్లాట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలేనని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని, తమ నోటీసులకు సమాధానం ఇవ్వాలని అధికారులు కోరడం మరోమారు కలకలం రేపింది.

కాగా, తన కార్యాలయం కూల్చివేతను అడ్డుకునేందుకు బాంబే హైకోర్టును ఆశ్రయించిన కంగన, స్టే ఆర్డర్ ను తెచ్చుకున్న సంగతి తెలిసిందే. నటుడు సుశాంత్ ఆత్మహత్య తరువాత, కంగన చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలాన్ని రేపగా, శివసేన నేతలు మండిపడిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందంటూ కంగన ఆదివారం నాడు రాష్ట్ర గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసింది కూడా.
BMC
Khar West
Kangana Ranaut
Home

More Telugu News