Corona Virus: ఇదే డెడ్లీ కరోనా వైరస్... చిత్రాలు ప్రచురించిన న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్!

  • శ్వాసకోశ కణాలకు కరోనా
  • మైక్రోస్కోపీ విధానంలో చిత్రాలు
  • రంగులద్ది విడుదల చేసిన శాస్త్రవేత్తలు
Corona Virus Pictures Released

కరోనా వైరస్ ఎలా ఉంటుందన్న విషయమై ఇప్పటికే ఎన్నో చిత్రాలు విడుదలకాగా, తాజాగా శ్వాసకోశ కణాలకు కరోనా సోకితే ఎలా కనిపిస్తాయన్న విషయాన్ని అత్యంత శక్తిమంతమైన స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ విధానంలో చిత్రాలు తీసిన శాస్త్రవేత్తలు వాటిని విడుదల చేశారు.

మానవ శ్వాసనాళాలకు కరోనా సోకిన 96 గంటల తరువాత ఈ చిత్రాలను తీశారు. వైరస్ కణాలు శరీరమంతటా ఏ విధంగా పరచుకుని, ఇతరులకు సంక్రమించేందుకు సిద్ధంగా ఉన్నాయన్న పరిస్థితిని కళ్లకు కట్టేలా చూపారు. ఈ చిత్రాలు న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురితం అయ్యాయి.

తొలుత నలుపు, తెలుపు  చిత్రాలు విడుదల కాగా, ఆపై రంగులద్దిన చిత్రాలను కూడా విడుదల చేశారు. ఈ కణాలు శ్వాసకోశ నాళాల్లోని శ్లేష్మంతో చేరి, వైరస్ లను ఊపిరితిత్తుల నుంచి ఇతర శరీర భాగాలకు వ్యాపించేలా చేస్తాయని సైంటిస్టులు వెల్లడించారు. అత్యంత శక్తిమంతమైన మ్యాగ్నిఫికేషన్ పరికరాలను వాడుతూ, శ్వాసకోశంలో పెరుగుతున్న కొవిడ్-19 నిర్మాణం, తీవ్రతలను శాస్త్రవేత్తలు చూపారు. దీన్ని శరీరంలోకి రాకుండా అడ్డుకోవాలంటే, మాస్క్ లను వాడటం తప్పనిసరని తెలిపారు. 

More Telugu News