సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Mon, Sep 14, 2020, 07:31 AM
Pooja hegde joins Radhe Syam shoot
  • 'రాధే శ్యామ్' కోసం హైదరాబాదుకు పూజ 
  • విజయదశమికి బాలకృష్ణ సినిమా టైటిల్ 
  • సంక్రాంతికి రానున్న గోపీచంద్ 'సీటీ మార్'    
*  చాలా రోజుల తర్వాత మళ్లీ షూటింగులో జాయిన్ అవుతున్నందుకు కథానాయిక పూజ హెగ్డే చాలా ఎగ్జయిట్ అవుతోంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'రాధే శ్యామ్' చిత్రం షూటింగులో జాయిన్ అవడానికి ఈ చిన్నది నిన్న హైదరాబాదు చేరుకుంది. కొన్ని రోజుల పాటు ఈ చిత్రం షూటింగ్ కోసం ఆమె ఇక్కడే వుంటుంది.
*  బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో రూపొందుతున్న మూడో చిత్రం షూటింగును ఈ నెలాఖరు నుంచి హైదరాబాదులో చేస్తారు. కాగా, ఈ చిత్రం టైటిల్ ను విజయదశమికి ప్రకటించడానికి నిర్ణయించారట. 'టార్చ్ బేరర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.
*  యాక్షన్ హీరో గోపీచంద్ నటిస్తున్న 'సీటీ మార్' చిత్రం షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయింది. తదుపరి షూటింగ్ ను వచ్చే నెల నుంచి నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లానింగ్ జరుగుతోంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha