చినజీయర్ స్వామిని స్వయంగా కలిసి పరామర్శించిన వైవీ సుబ్బారెడ్డి
- చినజీయర్ స్వామికి మాతృవియోగం
- తుదిశ్వాస విడిచిన అలివేలు మంగతాయారు
- సంతాపం తెలియజేసిన వైవీ సుబ్బారెడ్డి
ఇప్పటికే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం జగన్ ఫోన్ ద్వారా ఆయను పరామర్శించారు. తాజాగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వయంగా చినజీయర్ ను కలిశారు. ఆయనకు తన సంతాపం తెలియజేశారు. చినజీయర్ తల్లి అలివేలు మంగతాయారు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. కాగా, చినజీయర్ ను కలిసిన సమయంలో వైవీ వెంట మైహోమ్ రామేశ్వర్ రావు కూడా ఉన్నారు.