Andhra Pradesh: ఏపీలో తగ్గని కరోనా ప్రభంజనం.. ఈనాటి అప్టేడ్స్ ఇవిగో!

AP witnessed 9901 new Corona cases
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. డిశ్చార్జ్ అవుతున్న వారికి పోటీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 9,901 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా 1,398 కొత్త కేసులతో తొలి స్థానంలో ఉంది. తాజా కేసులతో రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 5,57,587కి చేరింది.

ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కారణంగా 68 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో, ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,846కి చేరుకుంది. మరోవైపు గత 24 గంటల్లో 75,465 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 95,733 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Updates

More Telugu News