M Nagaeshwararao: యమధర్మరాజు ఇంత ఆలస్యం చేశాడేంటి?... స్వామి అగ్నివేశ్ మృతిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ ఐపీఎస్

Former IPS officer M Nageshwararo comments on Swamy Agnivesh demise
  • నిన్న స్వామి అగ్నివేశ్ కన్నుమూత
  • మేకవన్నె పులి అంటూ మాజీ ఐపీఎస్ నాగేశ్వరరావు వ్యాఖ్యలు
  • హిందూ వ్యతిరేకి అంటూ ట్వీట్
ప్రముఖ సామాజికవేత్త, ప్రజాస్వామిక ఉద్యమకారుడు, ఆర్యసమాజ్ నేత స్వామి అగ్నివేశ్ నిన్న రాత్రి ఢిల్లీలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అగ్నివేశ్ ఢిల్లీలో ఐఎల్ బీఎస్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై చాలామంది తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

అయితే, మాజీ ఐపీఎస్ అధికారి ఎం.నాగేశ్వరరావు మాత్రం అందుకు భిన్నంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "మేకవన్నె పులి" అంటూ ఘాటైన ట్వీట్ చేశారు.

"నువ్వు కాషాయ దుస్తుల్లో ఉన్న హిందూ వ్యతిరేకివి. హిందుత్వానికి నువ్వు అపారమైన నష్టం కలుగుజేశావు. నువ్వో తెలుగు బ్రాహ్మణుడిగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను. ఇన్నాళ్లకు విమోచన కలిగింది. అయితే ఈ పని చేయడానికి యమధర్మరాజు ఇంత ఆలస్యం చేశాడేంటి అనే విచారం కలుగుతోంది" అంటూ నాగేశ్వరరావు స్పందించారు.

దీనిపై నెటిజన్లే కాదు, ఉన్నతాధికారులు కూడా మండిపడ్డారు. యూనిఫాంను అపవిత్రం చేశాడంటూ నాగేశ్వరరావుపై పోలీస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఘాటుగా స్పందించింది.

M Nagaeshwararao
Swamy Agnivesh
Demise
IPS
India

More Telugu News