Ragini Dwivedi: యూరిన్ శాంపిల్ లో నీటిని మిక్స్ చేసిన సినీ నటి రాగిణి!

Actress Ragini Dwivedi mixes water in urine for dope test
  • కన్నడ సినీ పరిశ్రమను షేక్ చేస్తున్న డ్రగ్స్ విచారణ
  • హీరోయిన్లు సంజన, రాగిణి అరెస్ట్
  • డోప్ టెస్ట్ కోసం యూరిన్ శాంపిల్స్ తీసుకున్న వైద్యులు
బాలీవుడ్ లో డ్రగ్స్ కల్చర్ పై విచారణ ఊపందుకుంది. ఇదే సమయంలో కన్నడ సినీ పరిశ్రమ సైతం డ్రగ్స్ విచారణతో వణుకుతోంది. ఇప్పటికే హీరోయిన్లు సంజన, రాగిణి ద్వివేదిలను సెంట్రల్ క్రైమ్ బ్రాంబ్ అరెస్ట్ చేసి, విచారిస్తోంది. టెస్టింగ్ నిమిత్తం వీరిని బెంగళూరులోని కేపీ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, డోప్ టెస్ట్ కోసం ఇచ్చిన యూరిన్ శాంపిల్ విషయంలో రాగిణి చీటింగ్ చేసినట్టు తెలుస్తోంది. తన యూరిన్ లో కొంత నీటిని ఆమె మిక్స్ చేసినట్టు తెలుస్తోంది. శాంపిల్ లో వాటర్ మిక్స్ అయినట్టు వైద్యులు గుర్తించారట. దీంతో, మరోసారి ఆమె వద్ద నుంచి శాంపిల్ తీసుకుని పంపినట్టు సమాచారం.
Ragini Dwivedi
Actress
Drugs
Dope Test

More Telugu News