Nutan Naidu: పోలీసుల కస్టడీకి నూతన్ నాయుడు!

Nutan Naidu sent to police custody for 3 days
  • పలువురిని మోసం చేసిన కేసులో నూతన్ నాయుడు అరెస్ట్
  • లోతుగా విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని పోలీసుల పిటిషన్
  • మూడు రోజుల కస్టడీకి అనుమతించిన కోర్టు
బిగ్ బాస్ కంటెస్టెంట్, సినీ నిర్మాత నూతన్ నాయుడుని విశాఖలోని కోర్టు పోలీసుల కస్టడీకి అనుమతించింది. మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ పేరిట పలువురికి ఫోన్ చేసి, మోసం చేసిన కేసులో ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ రిమాండులో వున్నారు.  

 ఆయనను మరింత లోతుగా విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విశాఖ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో శని, ఆది, సోమవారాల్లో విచారించడానికి పోలీసులకు జడ్జి అనుమతించారు. మరోవైపు దళిత యువకుడు శ్రీకాంత్ కు శిరోముండనం చేసిన కేసులో నూతన్ నాయుడి భార్య మధుప్రియ సహా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Nutan Naidu
Tollywood
Police Custody

More Telugu News