Rahul Gandhi: కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్న అమిత్ షా వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ సెటైర్లు!

Rahul Gandhi blames Amit Shah on his words on fighting against Corona
  • మోదీ నాయకత్వంలో పక్కా ప్రణాళికతో కరోనాతో పోరాడుతున్నామన్న అమిత్ షా
  • మోదీ పోరాటం వల్ల దేశం అగాధంలోకి కూరుకుపోయిందన్న రాహుల్
  • 12 కోట్ల ఉద్యోగాలు పోయాయని విమర్శ
ఎవరూ ఊహించని విధంగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోందని... అయినా, ప్రధాని మోదీ నాయకత్వంలో మన దేశం కరోనాపై పక్కా ప్రణాళికతో పోరాడుతోందంటూ కేంద్ర హోంమంత్రి నిన్న చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ ద్వారా రాహుల్ స్పందిస్తూ... పక్కా ప్రణాళికతో మోదీ ప్రభుత్వం చేసిన పోరాటం వల్ల దేశం అగాధంలోకి కూరుకుపోయిందని దుయ్యబట్టారు.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జీడీపీ 24 శాతం పడిపోయిందని రాహుల్ విమర్శించారు. 12 కోట్ల ఉద్యోగాలు పోయాయని అన్నారు. అదనంగా మరో 15.5 లక్షల లోన్లు నిరర్థకంగా మారిపోయాయని చెప్పారు. ప్రపంచంలోనే ప్రతి రోజు అతి ఎక్కువ కరోనా కేసులు, మరణాలు మన దేశంలో నమోదవుతున్నాయని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా... కేంద్ర ప్రభుత్వానికి, మీడియాకు మాత్రం 'ఆల్ ఈజ్ వెల్' అనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
Rahul Gandhi
Congress
Amit Shah
Narendra Modi
BJP
Corona Virus

More Telugu News