Aditya Paudwal: బాలీవుడ్ గాయని అనురాధ పౌడ్వాల్ తనయుడి మృతి

Bollywood singer Anuradha Paudwal son Aditya Paudwal dies of kidney failure
  • కిడ్నీ ఫెయిల్యూర్ తో ఆదిత్య పౌడ్వాల్ కన్నుమూత
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన శంకర్ మహదేవన్
  • అనేక ప్రాజెక్టుల్లో కలిసి పనిచేసినట్టు వెల్లడి
బాలీవుడ్ సీనియర్ గాయని అనురాధ పౌడ్వాల్ తనయుడు ఆదిత్య పౌడ్వాల్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆదిత్య పౌడ్వాల్ కొంతకాలంగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ముంబయిలోని ఓ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆదిత్య పౌడ్వాల్ మరణించిన విషయాన్ని స్టార్ సింగర్ శంకర్ మహదేవన్ వెల్లడించారు. శంకర్ మహదేవన్ తో కలిసి ఆదిత్య పౌడ్వాల్ అనేక మ్యూజికల్ ప్రాజెక్టుల్లో పనిచేశారు.

ఇది తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే వార్త అని, తమ ప్రియతమ ఆదిత్య పౌడ్వాల్ ఇకలేరని శంకర్ మహదేవన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఆదిత్య ఓ అద్భుతమైన సంగీతకారుడు అని, హాస్యప్రియుడైన ఆదిత్య మంచి మనిషి అని కొనియాడారు.

ఆపై మీడియాతో మాట్లాడుతూ, ఆదిత్య ఎంతో ఉత్సాహవంతుడైన వ్యక్తి అని, 35 ఏళ్ల వయసులోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడని వివరించారు. వాస్తవానికి ఆదిత్య చాలా సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని శంకర్ మహదేవన్ వెల్లడించారు. అతడికి హైపర్ టెన్షన్, ఊపిరితిత్తుల సమస్యలు కూడా ఉండేవని, చివరికి కిడ్నీలు ఫెయిల్ కావడంతో మరణం సంభవించిందని వివరించారు.
Aditya Paudwal
Anuradha Paudwal
Demise
Kidney Failure
Shankar Mahadevan
Bollywood

More Telugu News