బ్లడ్ టెస్ట్ చేయించుకోనంటూ హీరోయిన్ సంజన రచ్చ

11-09-2020 Fri 17:42
  • కన్నడ పరిశ్రమలో డ్రగ్స్ కలకలం
  • హీరోయిన్లు సంజన, రాగిణి అరెస్ట్
  • ఆసుపత్రిలో పోలీసులకు చుక్కలు చూపించిన సంజన
Actresss creates scene in hospital
కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. సినీ హీరోయిన్లు సంజన, రాగిణి ద్వివేదిలను ఇప్పటికే సెంట్రల్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, సంజన బ్లడ్ శాంపుల్స్ తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా... ఆసుపత్రిలో సంజన రచ్చరచ్చ చేసింది.

తాను రక్త పరీక్షలు చేయించుకోనని... ఒక వేళ తన రక్తాన్ని తీసుకున్నా, టెస్టు రిపోర్ట్ తనదేననే గ్యారెంటీ ఏమిటని ఆమె మండిపడ్డారు. డ్రగ్స్ వ్యవహారంలో తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని... జనాల ముందు తనను పిచ్చిదాన్ని చేస్తున్నారని రచ్చ చేసింది. పోలీసులకు చుక్కలు చూపించింది. మరోవైపు విచారణలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.