Uttam Kumar Reddy: దుబ్బాక ఎన్నిక చారిత్రాత్మకమైనది: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Dubbaka byelection is historical says Uttam Kumar Reddy
  • ఈ ఎన్నికను పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది
  • పార్టీ శ్రేణులు ఏకతాటిపైకి రావాలి
  • దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమి ఖాయం
దుబ్బాక ఉప ఎన్నిక చారిత్రాత్మకమైనదని.. ఈ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉపఎన్నికలో గెలిచేందుకు పార్టీ శ్రేణులు విభేదాలను పక్కనపెట్టి, ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.

ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణను ప్రారంభించామని... పోటీ చేయబోయే అభ్యర్థిని త్వరలోనే ఎంపిక చేస్తామని చెప్పారు. మండల కమిటీలను మూడు రోజుల్లోగా పూర్తి చేయాలని డీసీసీ అధ్యక్షులను ఆదేశించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసిందని... దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని చెప్పారు.
Uttam Kumar Reddy
Dubbaka
Congress
KTR
KCR

More Telugu News