Kangana Ranaut: కంగనాపై డ్రగ్స్ కేసు.. విచారణకు హాజరు కావాలని 'మహా' పోలీసుల నోటీసులు!

  • ఇప్పటికే కంగన కార్యాలయం పాక్షికంగా కూల్చివేత
  • మాజీ ప్రియుడి ఇంటర్వ్యూ ఆధారంగా నోటీసులు
  • కంగనకు ఉచ్చు బిగించేందుకు యత్నిస్తున్న ఉద్ధవ్ ప్రభుత్వం
Kangana Ranaut served notices to attent for interrogation in drugs case

కంగన రనౌత్ పై ఉచ్చు బిగించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆమె కార్యాలయాన్ని పాక్షికంగా కూల్చివేసిన సంగతి తెలిసిందే. తాజాగా డ్రగ్స్ కేసులో ఆమెను విచారించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఆమెను విచారించే బాధ్యతను ముంబై పోలీసులకు అప్పగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఇప్పటికే డ్రగ్స్ కేసులో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు మహారాష్ట్ర హోంమంత్రి మాట్లాడుతూ కంగన డ్రగ్స్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. కంగన మాజీ ప్రియుడు అధ్యయన్ సుమన్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూని ఆయన ప్రస్తావించారు. కంగన డ్రగ్స్ తీసుకుంటుందని ఆ ఇంటర్వ్యూలో అధ్యయన్ తెలిపాడు. తనకు కూడా డ్రగ్స్ ఇచ్చేందుకు కంగన యత్నించిందని ఆరోపించారు. అధ్యయన్ ఇంటర్వ్యూని ఆధారంగా చేసుకుని... కంగనను ఇరికించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.

అధ్యయన్ వ్యాఖ్యలపై ఏం సమాధానం చెపుతారంటూ కంగనకు ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ అంశానికి సంబంధించి తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులపై కంగన స్పందించాల్సి ఉంది.

More Telugu News