Chalamalasetty Ramanujaya: కరోనాతో టీడీపీ నేత చలమలశెట్టి రామానుజయ మృతి

  • ఇటీవలే కరోనా బారినపడిన రామానుజయ
  • విజయవాడ జీజీహెచ్ లో చికిత్స
  • సంతాపం ప్రకటించిన చంద్రబాబు
TDP leader Chalamalasetty Ramanujaya dies of corona

టీడీపీ నేత, ఏపీ కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ కరోనా మహమ్మారికి బలయ్యారు. రామానుజయకు కొన్ని రోజుల కిందట కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా లక్షణాలు ఉండడంతో చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. కొన్నిరోజులుగా ఆయనకు వైద్యులు వెంటిలేటర్ అమర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఇవాళ పరిస్థితి విషమించగా, వైద్యులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. రామానుజయ ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు.

పార్టీ నేత మృతితో అధినేత చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చలమలశెట్టి రామానుజయ మృతితో టీడీపీ ఓ సమర్థుడైన నేతను కోల్పోయిందని, ఆయన లేని లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు. కాపు రిజర్వేషన్ల నుంచి మహిళల స్వయం ఉపాధి పథకాల రూపకల్పన వరకు రామానుజయ ప్రధానభూమిక పోషించారని కొనియాడారు. కాపుల సంక్షేమం కోసం ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు.

రామానుజయ స్వస్థలం కృష్ణా జిల్లా కలిదిండి మండలం అవ్వకూరు. రామానుజయ మృతితో కృష్ణా జిల్లా టీడీపీ సీనియర్లు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

More Telugu News