TV actress sravani: బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు.. పోలీసుల ఎదుట లొంగిపోయిన దేవరాజ్

Devaraj Reddy surrendered in SR nagar police station
  • కాకినాడ నుంచి వచ్చి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో లొంగుబాటు
  • వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు
  • నేడు శ్రావణి కుటుంబ సభ్యులను విచారించనున్న పోలీసులు
శ్రావణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్ ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ మేరకు సీఐ నర్సింహారెడ్డి తెలిపారు. దేవరాజ్ వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందన్న శ్రావణి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మరోవైపు, దేవరాజ్-శ్రావణి ఆడియో టేప్ బయటకు వచ్చింది. అందులో శ్రావణిని దేవరాజ్ బెదిరించినట్టు స్పష్టంగా ఉంది. దీంతో విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు ఆదేశించారు.

కాకినాడ నుంచి హైదరాబాద్ చేరుకున్న దేవరాజ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడి నుంచి పోలీసులు వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. తన వద్దనున్న కాల్ రికార్డులను పోలీసులకు సమర్పించనున్నట్టు దేవరాజ్ తెలిపాడు. దేవరాజ్‌ను విచారిస్తున్నామని చెప్పిన పోలీసులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయికృష్ణారెడ్డిని కూడా విచారిస్తామన్నారు. కాగా, నేడు శ్రావణి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారించనున్నారు. కాకినాడలోని గొల్లప్రోలులో నేడు శ్రావణి అంత్యక్రియలు జరగనున్నాయి.
TV actress sravani
Suicide
Devaraj Reddy
SR nagar police
Crime News

More Telugu News