Gaddam Nagesh: మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ కు జ్యుడీషియల్ రిమాండ్

  • రూ. 1.12 కోట్ల లంచం కేసు
  • గడ్డం నగేశ్ తో పాటు మరో నలుగురికి రిమాండ్
  • రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
Medak Additional Collector sent to Judicial remand

లంచం కేసులో మెదక్ అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ కు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. రూ. 1.12 కోట్ల  లంచం కేసులో నగేశ్ తో పాటు నర్సాపూర్ ఆర్డీవో అరుణారెడ్డి, చల్పిచేడు తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసీం మహ్మద్, నగేశ్ బినామీ జీవన్ గౌడ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. 112 ఎకరాల భూమికి ఎన్వోసీ ఇవ్వడం కోసం ఈ లంచాన్ని నగేశ్ డిమాండ్ చేశారు. ఎకరాకు రూ. లక్ష చొప్పున 112 ఎకరాలకు రూ. 1.12 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

More Telugu News