Antharvedi: జగన్ కీలక నిర్ణయం.. సీబీఐకి అంతర్వేది రథం దగ్ధం కేసు!

  • అంతర్వేదిలో దగ్ధమైన స్వామివారి రథం
  • రాష్ట్ర ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న విమర్శలు
  • సీబీఐ విచారణకు అప్పగించాలని డీజీపీకి సీఎం ఆదేశం
Jagan decides to handover Antarvedi case to CBI

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అంతర్వేదిలో స్వామివారి రథం అగ్నికి ఆహుతైన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో హిందూ మతంపై దాడి జరుగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనకు కారకులైన దోషులు ఎవరైనా సరే కఠిన శిక్ష పడాలన్న భావనతో కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ డీజీపీని ఆదేశించారు. దీంతో, సీబీఐ దర్యాప్తును కోరుతూ కేంద్ర హోంశాఖకు డీజీపీ కార్యాలయం లేఖ రాసింది. దీనికి సంబంధించి రేపు జీవో వెలువడనుంది.

More Telugu News