Etela Rajender: ఆర్ఎన్ఏ వైరస్ లకు ఇంత వరకు వ్యాక్సిన్ లు లేవు: ఈటల రాజేందర్

So far there are no vaccines for RNA viruses
  • టెక్నాలజీ పెరిగినా సమాజాన్ని మనిషి శాసించలేడు
  • సమాజాన్ని ప్రకృతి మాత్రమే శాసించగలదు
  • ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ పై సందేహాలు తలెత్తుతున్నాయి
ఆర్ఎన్ఏ వైరస్ లకు ఇంత వరకు వ్యాక్సిన్ లు లేవని తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ, కరోనాపై పోరాడేందుకు ప్రపంచంలోని అనేక దేశాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రభుత్వాలే ఫండింగ్ చేస్తున్నాయని తెలిపారు. టెక్నాలజీ ఎంత పెరిగినా సమాజాన్ని మనిషి శాసించలేడనే విషయాన్ని కరోనా తేల్చిచెప్పిందన్నారు.

కరోనాకు ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ వస్తుందని అందరూ సంతోషపడ్డారని... అయితే, దానిపై కూడా ఇప్పుడు అనుమానాలు తలెత్తుతున్నాయని అన్నారు. ఆర్ఎన్ఏ వైరస్ లో ఒకటైన హెచ్ఐవీకి కూడా ఇంత వరకు వ్యాక్సిన్ లేదని చెప్పారు. సమాజాన్ని ప్రకృతి మాత్రమే శాసించగలదని... మనిషి శాసించలేడని అన్నారు.
Etela Rajender
TRS
Corona Virus
Vaccine

More Telugu News