Vadivel Balaji: తమిళ కమెడియన్ వడివేల్ బాలాజీ మృతి

Actor Vadivel Balaji passes away
షార్ట్స్‌లో చూడండి
తమిళ సినీ హాస్యనటుడు వడివేల్ బాలాజీ గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన వయసు 45 సంవత్సరాలు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. 15 రోజుల క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో... ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించే స్తోమత లేకపోవడంతో ఆయనను చిన్నచిన్న ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే చేర్పించారు. చివరకు డబ్బు లేకపోవడంతో ఈ ఉదయం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలాజీని కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.

విజయ్ టీవీలో ప్రసారమయ్యే ఓ కామెడీ షోతో బాలాజీ బాగా పాప్యులర్ అయ్యాడు. పలు తమిళ చిత్రాల్లో నటించాడు. ప్రముఖ తమిళ కమెడియన్ వడివేలును ఆయన అనుకరించేవాడు... దీంతో, ఆయనకు వడివేలు బాలాజీ అనే పేరు స్థిరపడిపోయింది.
Go Back to Shorts
Vadivel Balaji
Kollywood
Dead

More Telugu News