Renu Desai: అనుకున్నది ఒకటి.. అయింది మరొకటి: పాత ఫొటోలను షేర్ చేసిన రేణు దేశాయ్

Renu Desai shares her old pics
  • కెమెరా ముందుకొచ్చి 25 ఏళ్లు పూర్తయ్యాయి
  • నాసాలో చేరాలనుకున్నాను
  • అనుకోకుండానే కెమెరా ముందుకు వచ్చాను
ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ కెమెరా ముందుకొచ్చి 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్బంగా ఆమె తన అనుభవాలను, వ్యక్తిగత అంశాలను సోషల్  మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తాను అంతరిక్ష శాస్త్రవేత్త లేదా డాక్టర్ కావాలనుకున్నానని... అయితే  విధి మాత్రం తనను మరో దారిలో తీసుకెళ్లిందని చెప్పారు. నాసాలో చేరాలనుకున్న తాను... అలా జరగకపోయే సరికి చాలా బాధ పడ్డానని అన్నారు. కొన్ని సంవత్సరాల పాటు తాను బాధను అనుభవించానని చెప్పారు.

16 ఏళ్ల వయసులో తాను అనుకోకుండానే కెమెరా ముందుకు వచ్చానని తెలిపారు. ఆ తర్వాత సినిమాలతో ప్రేమలో పడిపోయానని చెప్పారు. సినీ రంగంలోకి అడుగు పెట్టిన తర్వాత తన జీవితంలో జరిగిన అన్ని విషయాలు మీకు తెలుసని అన్నారు. ఈ సందర్భంగా ఆమె తన పాత ఫొటోలను షేర్ చేశారు.
Renu Desai
tollywood
Old Pics

More Telugu News