sudheer babu: మొక్క‌నాటి ప్ర‌తిజ్ఞ చేసిన యంగ్ హీరో సుధీర్‌బాబు

sudheer babu plants
  • నా ప్ర‌తి సినిమా విడుద‌ల‌కు మొక్క‌నాటుతా
  • గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా గొప్ప‌ది
  • ఎంపీ సంతోష్ కుమార్ కు అభినంద‌న‌లు
టాలీవుడ్ హీరో సుధీర్‌బాబు తాజాగా న‌టించిన  'వి' సినిమా ఇటీవ‌లే విడుద‌లైన విష‌యం తెలిసిందే.  తాజాగా ఆయన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్క నాటి, ఇక‌పై తాను నటించబోయే ప్రతి సినిమాకీ గుర్తుగా ఓ మొక్కను నాటుతానని హామీ ఇచ్చాడు.

ఇటీవ‌ల నటుడు నవీన్‌ కృష్ణ మొక్క నాటి సుధీర్ బాబును నామినేట్‌ చేయడంతో ఆయ‌న ఈ రోజు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి ఈ ప్ర‌తిజ్ఞ చేశాడు. తాను నాటిన మొక్కకు 'వి' అనే పేరు పెట్టాడు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన ఎంపీ సంతోష్‌ కుమార్‌కు అభినందనలు తెలుపుతున్న‌ట్లు సుధీర్ బాబు ట్వీట్ చేశాడు.  

త‌న‌ ప్రయత్నాన్ని 'వి' సినిమా నుంచి ప్రారంభిస్తున్నానని చెప్పాడు. ఇక తాను దర్శకుడు మోహన్‌కృష్ణ ఇంద్రగంటి, నిర్మాత దిల్‌రాజు, ఆదితీరావు హైదరీ, నివేదా థామస్ కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసురుతున్నాన‌ని చెప్పాడు.
sudheer babu
Tollywood
Green India Challenge

More Telugu News