Pawan Kalyan: హైద‌రాబాద్ లోని త‌న ఆఫీసు వ‌ద్ద‌ ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ దీక్ష‌కు దిగిన ప‌వ‌న్ క‌ల్యాణ్!

  • దేవతామూర్తులు, ఉత్సవ రథాల విధ్వంసంపై నిర‌స‌న‌
  • ప్రభుత్వ నిర్లిప్త వైఖరిపై పోరాట‌మ‌న్న జ‌న‌సేన‌
  • త‌మ ఇళ్ల వ‌ద్ద దీక్ష‌కు దిగిన‌ బీజేపీ నేతలు
pawan kalyan protest

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ 'ధర్మ పరిరక్షణ దీక్ష'కు దిగారు. ఇటీవ‌ల తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం రథం ‌ అగ్నికి ఆహుతైన ఘ‌ట‌న‌తో పాటు హిందూ దేవాల‌యాల విష‌యంలో చోటు చేసుకుంటోన్న ప‌రిణామాలను నిర‌సిస్తూ ఈ దీక్ష‌కు దిగిన‌ట్లు జ‌న‌సేన నేత‌లు చెబుతున్నారు.

ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ధర్మ పరిరక్షణ దీక్షకు జనసేన-బీజేపీ సంయుక్తంగా పిలుపునివ్వ‌డంతో ఇందులో భాగంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ హైద‌రాబాద్ లోని త‌న కార్యాల‌యం వ‌ద్ద ఈ దీక్ష చేస్తున్నారు.
                 
'దేవతామూర్తులు, ఉత్సవ రథాల విధ్వంసంపై ప్రభుత్వ నిర్లిప్త వైఖరికి నిరసనగా, జనసేన-బీజేపీ సంయుక్తంగా పిలుపునిచ్చిన "ధర్మ పరిరక్షణ దీక్ష" లో భాగంగా హైదరాబాద్ లోని తన నివాసంలో ప‌వ‌న్ ఇందులో పాల్గొన్నారు' అంటూ జ‌న‌సేన ప్ర‌క‌ట‌న చేసింది. దేవాదాయ ఆస్తుల‌ను కాపాడాల‌ని జ‌న‌సేన డిమాండ్ చేసింది.

ఆఫీసు ఆవ‌ర‌ణ‌లో కుర్చీలో కూర్చొని పుస్త‌కం చ‌దువుతూ ఆయ‌న ఇందులో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ దీక్షలు చేయాల‌ని ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ల్యాణ్ పిలుపునిచ్చారు. మ‌రోవైపు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు  దీక్ష చేప‌డుతున్నారు. బీజేపీ నేత‌లు, కార్యకర్తలు కూడా తమ ఇళ్ల వద్ద దీక్షలు చేపట్టారు.  

More Telugu News